NLG: ఎంజీ యూనివర్సిటీలో ABVP శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ హాజరయ్యారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి, మహిళా శక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఈ పండుగను దేవతా స్వరూపిణిగా భావించి, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు.