KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మంగళవారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాలలోని రాజకీయ పరిస్థితులపై ఆయన కార్య కర్తలను అడిగి తెలుసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.