SRD: జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సీఎస్ఆర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పరిశ్రమ సామాజిక బాధ్యతగా సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు. మెడికల్ కళాశాలలో క్రీడా పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.