కోనసీమ: ప్రయాణికుల అవసరాల మేరకు మండపేట బస్ స్టాండ్‌లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పురపాలక సంఘం చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. బస్ స్టాండ్ పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి బస్టాండ్‌ను శానిటేషన్ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు.