ప్రకాశం: సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులతో అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ రాజా బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉద్యోగులు, అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోనని హెచ్చరించారు. మంగళవారం ప్రకాశం భవనం నుండి మండల స్థాయి అధికారులతో రెవెన్యూ సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.