AP: తిరుమల భక్తులకు శుభవార్త వచ్చింది. భక్తుల కోసం టీటీడీ ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. భక్తులు ఈ యంత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే ప్రోత్సాహకంగా రూ.5 చెల్లిస్తారు. UPI ద్వారా లాగిన్ అయి, QR కోడ్ను స్కాన్ చేయడంతో ఈ చెల్లింపులు జరుగుతాయి.