MDK: చేగుంట మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమల్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. అప్రమత్తమైన ఉద్యోగులు రామయంపేట ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.