మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కొచ్చిలోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. భూటాన్ నుంచి 100 లగ్జరీ కార్లను.. అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 30 చోట్ల కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.