NLR: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత రెండు రోజులు క్రితం కాన్పు సమయంలో పసిబిడ్డ మృతి చెందిన విషయంపై మంగళవారం విచారణ బృందం ఆరోగ్య కేంద్రానికి చేరుకొని విచారణ చేపట్టారు. బృందం వైద్యులను సిబ్బందిని, బాధితులను విచారించారు. వారు మాట్లాడుతూ.. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.