గుంటూరు ప్రగతినగర్ రామిరెడ్డి తోట ప్రాంతంలో మంగళవారం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పర్యటించారు. కాలువల పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి అంశాలను పరిశీలించి, స్థానిక ప్రజల అభిప్రాయాలను విన్నారు. వెంటనే పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.