SRPT: మఠంపల్లి మండలం వర్థాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి ఎస్ జీఎఫ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. హుజూర్నగర్లో ఇటీవల జరిగిన డివిజన్ స్థాయి పోటీల్లో అండర్ 14,17 విభాగాల్లో అనూష, హర్షిత, ధరణి, మల్లేశ్వరిలు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వీరస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.