ప్రకాశం: పేదవారికి మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం YCP ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజ్ అంశంపై ప్రజలు, మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమన్నారు. YCP కావాలని తప్పుదోవ పట్టిస్తుందని ప్రజలు అంటే తాను రాజకీయ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.