MLG: జిల్లా మేడారంలో వనదేవతల కొత్త నమూనాను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే అమ్మవార్ల నమూనా వీడియో ప్లే చేయడానికి I&PR అధికారులు రిమోట్‌ను సీఎం చేతికి అందజేశారు. ప్రొజెక్టర్ ఆన్ అయిన తర్వాత రిమోట్ సీఎం చేతి నుంచి మాయమైంది. వేదిక పై వెతికినా రిమోట్ ఆచూకీ లభించలేదు, దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు.