NLG: దసరా పండుగ సెలవుల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ASP మౌనిక కోరారు.పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. ఇళ్లలో విలువైన బంగారు ఆభరణాలు నగదు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. బస్టాండ్లలో, రద్దీ ప్రదేశాలలో సెల్ ఫోన్లు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.