NGKL: కల్వకుర్తి పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో తొలి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కోట్ల వెంకటరమణ నియమితులయ్యారు. కోర్టులో గత 26 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు సేవలు అందించనున్నారు.