W.G: పెరవలి మండలం తీపర్రు గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను తణుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తణుకు డిపో చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి వెళుతుండగా అదుపుతప్పి ఒక ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలు పాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.