VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాలలో 15% వృద్ధి రేటు సాధించే విధంగా ఆయా రంగాల్లో కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి భారతి, ఉద్యాన అధికారి చిట్టిబాబు పాల్గొన్నారు.