జీవితంలో విజయం సాధించేందుకు చిన్న సలహా ఏంటంటే.. నీలోని బలాలను ఉపయోగిస్తూ ఉండటమే.. నీకు గొప్ప వ్యక్తిత్వం ఉంటే దానిని ఉపయోగించుకోవాలి. సాంకేతిక సామర్థ్యాలు, నైపుణ్యాలు నీలో ఉంటే వాటిని వినియోగిస్తూ ఉండాలి. పెద్ద బాధ్యతలు స్వీకరించగలిగే నేర్పు ఉంటే ఆ దిశగా సాగిపోవాలి. అంతే తప్ప ఇతరుల లక్షణాలను నువ్వు అనుసరించకు.