SKLM: ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు స్థానిక పాఠశాల విద్యార్థులకు పోలీస్ ఆయుధాలు, పరికరాలు, చట్టాలు పై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశం మేరకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.