KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నాలుగు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. రైతులు 44 వాహనాల్లో 330 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా, క్వింటాకు గరిష్టంగా రూ. 7,050 ధర పలికింది. గోనె సంచుల్లో తెచ్చిన 13 క్వింటాళ్ల పత్తికి రూ. 5,700 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు.