కృష్ణా: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజల ఇబ్బందులు, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించామని ఆయన తెలిపారు.