MNCL: బెల్లంపల్లి పట్టణం 85 డీప్ సింగరేణి స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను సెక్యూరిటీ అధికారులు కూల్చివేశారు. సింగరేణి భూమిని ఆక్రమించి నిర్మించిన షెడ్డును తొలగించారు. పట్టణంలో సింగరేణి ఖాళీ స్థలాల ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, దీనిపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆక్రమిత భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటామన్నారు.