రోజూ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గి అలసట, శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. టైప్-2 డయాబెటిస్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు. బరువు పెరిగే అవకాశం ఉంది.