AP: తుని ఘటన కేసులో నిందితుడి ఆత్మహత్యపై సీఐ చెన్నకేశవరావు క్లారిటీ ఇచ్చారు. ‘నిన్న తునిలో బాలికపై నారాయణరావు అత్యాచారయత్నం చేశాడు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా.. టాయిలెట్ అని చెప్పి నిందితుడు కోమటి చెరువులో దూకాడు. పోలీసులు గాలించి నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు’ అని పేర్కొన్నారు.