BDK: ఇల్లందు మండలం కొమరారం గ్రామపంచాయతీలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు అవస్థలు పడాల్సి వస్తుందని సేవాలాల్ సేన మండల యువసేన అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. నిన్న కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలన్నారు.