WGL: చెన్నారావుపేట మండలంలోని జీడిగడ్డ గ్రామానికి చెందిన బానోతు రాజు అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చెన్నారావుపేట మండల శివారులో బుధవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. దీంతో అనుమానాస్పదంగా కనిపించిన రాజు బ్యాగును పరిశీలించగా 15 గ్రాముల గంజాయి లభించింది. పోలీసులు రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.