GNTR: వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నందున, ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.