SRPT: ఈ నెల 25న హుజూర్నగర్లో జరగనున్న మెగా జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉచిత సౌకర్యాలు ప్రకటించారు. బుధవారం రాత్రి హుజూర్నగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోనున్న అభ్యర్థులకు స్కూల్ బస్సుల్లో రానుపోను ఉచిత ప్రయాణంతో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశామన్నారు.