ఖమ్మం నగరంలో డిసెంబర్ 26న నిర్వహించే సీపీఐ శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి అన్నారు. గురువారం సత్తుపల్లిలో సీపీఐ మండల కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి విజయం సాధించిందని పేర్కొన్నారు.