NLG: జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పోలీసు అధికారులకు సూచించారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో నేరాలు నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.