భారత ఓపెనర్ ప్రతీకా రావల్ సెంచరీతో అదరగొట్టింది. న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో 122 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రపంచకప్లో ఆమెకు ఇదే తొలి సెంచరీ కాగా, ఓవరాల్గా 3వ వన్డే సెంచరీ. అలాగే, భారత జట్టుకు ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది 10వ సెంచరీ. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.