KNR: ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులపై ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.