కృష్ణా: ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులను గురువారం పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించారు. రూ.4.5 లక్షల జనరేటర్, రూ.3లక్షలతో ఏర్పాటు చేసిన షెడ్ ప్రారంభించారు. ప్రభుత్వ నిధులు 1.5 లక్షలు, ఐడిబిఐ బ్యాంక్ రూ.మూడు లక్షలు, విశ్వశాంతి పాఠశాల యాజమాన్యం రూ.మూడు లక్షలతో ఈ పనులు చేసినట్లు తెలిపారు.