E.G: నల్లజర్ల మండలం దూబచర్లలో గురువారం విషాదం చోటుచేసుకుంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన శీర్ల సునీల్ కూలిపనికి వెళ్లాడు. పామాయిలు గెలలు కోస్తుండగా గెడకు ఉన్న కత్తి ఊడిపడి మెడ మీద పడింది. దీంతో సునీల్ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకి సమాచారం తెలియజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.