W.G: ఆచంటలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని, మార్టేరు నుంచి ఆచంట ప్రధాన రహదారినీ రూ. 4 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. ఇవాళ పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బైపాస్ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామని, అన్న కాంటీన్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.