KMM: గో సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ, గో రక్షకులపై జరిగే దాడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా గోరక్షా, గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.