SKLM: బూర్జ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను శాసనసభ్యులు కూన రవికుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, ముఖ్యంగా పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.