NLG: చింతపల్లి మండలం గొడుకొండ్ల గ్రామం VT నగర్లో కొలువైన శబరికొండ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో జరిగిన మహా పాదయాత్ర పూజ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే బాలునాయక్ భక్తులతో, నాయకులతో కలిసి పాల్గొన్నారు. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు ధరించే స్వామి మాలలు ఎంతో పవిత్రతను చాటుకుంటాయని అన్నారు. ఈ మేరకు పాదయాత్ర భక్తులను అభినందించారు.