BHPL: మహాముత్తారం మండలం దుబ్బలపాడు గ్రామంలోని మోడల్ స్కూల్‌ను గురువారం SFI జిల్లా అధ్యక్షుడు స్మరణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్మరణ్ మాట్లాడుతూ.. మోడల్ గర్ల్స్ హాస్టల్ నిర్మాణాన్ని తక్షణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.