BHNG: యాదాద్రి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులొ నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్నీ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గేట్ రిజిస్టర్ పరిశీలించి, ఆటోమేటిక్ పాడి క్లీనర్ ద్వారా జరుగుతున్న ధాన్యం శుభ్రపరిచే ప్రక్రియను గమనించారు. రైతులకు లోటు పాటులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని సూచించారు.