JGL: రాయికల్ మండలం బోర్నపల్లి చిలకగూడెంలో గుస్సాడి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల గుస్సాడీ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని జంగూబాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి గుస్సాడి వేడుకల్లో పాల్గొన్నారు.