SRPT: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రెండవ రోజు పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వాస్తు మాధవ్ ఆధ్వర్యంలో భక్తులచే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.