వనపర్తి మండలంలో 19వ వార్డుకు చెందిన కృష్ణయ్య, సంతోషమ్మ దంపతుల కుమార్తె సుమశ్రీ గ్రూప్-1లో ప్రతిభకనబరిచి DSPగా ఎంపికైన సందర్భంగా ప్రముఖ సామాజిక వేత్త పోచా రవీందర్ రెడ్డి ఇవాళ ఆమెను స్వగృహంలో కలసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమశ్రీ అనేక యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.