TPT: చిల్లకూరు మండలంలో భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురవడం వల్ల తిప్పగుంటపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావలసిన నిత్యావసర సరుకులను అందజేశారు. వరద తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు ప్రజలు ఎవరు రాకపోకలు సాగించవద్దని అధికారులు ఆదేశించారు.