MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు సామెల్ ఇంటి నిర్మాణానికి తీసుకున్న ఇటుకలల్లో నాగుపాము కనిపించింది. వెంటనే జడ్చర్ల స్నేక్ టీం BRR డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ సదాశివయ్యకు చెప్పడంతో అతని స్టూడెంట్ శ్రీకాంత్ నాగుపామును పట్టుకుని డబ్బలో వేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. మా ప్రొఫెసర్ చదువుతోపాటు పాములు పట్టడంలో శిక్షణ ఇస్తున్నారన్నారు.