NLG: నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల పరిశీలకులు బిశ్వరంజన్ మహంతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న 20 మందిలో 10 మంది బీసీలు, నలుగురు ఓసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు. ఈ దరఖాస్తుదారుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.