బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్నా విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే కూటమి సీఎం అభ్యర్థిపై మాత్రం ఏకాభిప్రాయం కుదిరిందట. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లడానికి భాగస్వామ్య పార్టీలు అంగీకరించాయని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. సీఎం అభ్యర్థి గురించి ఇవాళ సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.