KMR: గాంధారి హత్య కేసును వేగంగా ఛేదించిన సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవిని కామారెడ్డి జిల్లా SP రాజేశ్ చంద్ర అభినందించారు. బుధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు క్యాష్ రివార్డును అందజేసి ప్రతిభను కొనియాడారు. విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచారని SP ప్రశంసించారు.