SRPT: నిన్నటిదాకా రైతులను మురిపించిన చినుకు ఇప్పుడు ఆగకుండా కురుస్తోంది. ఈ అకాల వర్షాలు రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లో వరి కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వరి పంట కోసిన వారు వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నాన్న ఇబ్బందులు పడుతున్నారు.