KMM: జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభించింది. గురువారంతో దరఖాస్తు గడువు ముగుస్తుండగా, వ్యాపారులు తీవ్రంగా పోటీ పడ్డారు. జిల్లాలోని 116 షాపులకు బుధవారం వరకు ఏకంగా 4,177 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.